కనుమూరి బాపిరాజు
మానవసేవ - మాధవసేవ
కనుమూరి బాపిరాజు * మానవసేవ - మాధవసేవ
Thursday, August 25, 2011
Monday, September 20, 2010
శాశ్వత ముంపునివారణకు కార్యాచరణ ప్రణాళిక
పశ్చిమ డెల్టా ప్రాంతంలో శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ర్ట భారీ నీటీ పారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య అధికారులను ఆదేశించారు. పాలకొల్లు, భీమవరం, ఉండి నియోజక వర్గాల్లో వివిధ కాల్వలు, లాకుల పరిస్ధితిని ఆదివారం మంత్రి పొన్నాల లక్ష్మయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలో పది లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతున్నదని ఆయితే వరదలు భారీ వర్షాలు సమయంలో తరచూ ముంపునకు గురవుతున్నాయన్నారు. ఈ సమాయాలలో నివాస ప్రాంతాలు, పంటలు జలమయమై నష్టం వాటిల్లుతున్నదన్నారు.
ఈ ముంపు నుంచి రక్షించేందుకు శాశ్వత ముంపు నివారణ కార్యాచరణ రూపొందిస్తామని ఇందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్‌ను నియమించనున్నామన్నా. ఇందుకు సంబంధించి నెలలోగా సమగ్ర నివేదిక అందజేయాలని నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీరును మంత్రి ఆదేశించారు. సర్ఆర్ధర్ కాటన్ మహాశయుడు 150 సంవతవ్సరాల క్రితం నిర్మించిన నేటి డ్రైన్లు, పంటకాల్వలు ద్వారా ఎంతో ప్రయోజనం పొందామన్నారు. అయితే కాల క్రమేణా వ్యవసాయానికి అనుకూలంగా వీటిని ఆధునీకరణ చేయవలసి ఉందన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక వరం లాంటిదని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఎన్ని సమస్యలు, అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పేద రైతుల పాలిట ఈ ప్రాజెక్టు కల్పవృక్షం లాంటిదన్నారు. వృధాగా పోయే నీరును బీడు భూములకు మళ్లించడమే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని, చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్నా అవి సమసిపోగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ నీటి పారుదల శాఖామంత్రి తొలుత యలమంచిలి మండలం లక్ష్మీపాలెం, నక్కల ఔట్‌ఫాల్ స్లూయిజ్‌ను పరిశీలించారు.

వై.వి.లంక దగ్గర కాల డ్రైయిన్‌ను పరిశీలించి పాడైన షట్టర్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉండి ఎండగండి లాకులను పొన్నాల లక్ష్మయ్య పరిశీలించారు. అవసరమైన మరమ్మతులకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట నరసాపురం పార్లమెంట్‌సభ్యులు కనుమూరి బాపిరాజు, జిల్లా పరిషత్తు ఛైర్మన్ మేకా శేషుబాబు, శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు, బంగారు ఉషారాణి, పులపర్తి రామాంజనేయులు, ఉండి శాసనసభ్యులు కలవపూడి శివ, ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పండురాజు, యలమంచిలి ఎంపిపి చిలుకూరి బాపిరాజు, నీటిపారుదల శాఖ ఇన్‌ఛార్జి ఎస్.ఇ చంద్రరావు, ఆర్డివో ఎస్.వెంకట సుబ్బయ్య, ప్రభృతులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు ప్రతీ ఏటా జరుగుతున్న పంట నష్టంపై ప్రభుత్వపరంగా మేజర్ ఇరిగేషన్ శాఖామంత్రి ఒప్పుకోలు ప్రకటన చేశారు. ఇకముందు ఇలాంటి పరిస్థితి రాదంటూ పశ్చిమ రైతులకు ఒక భరోసా ఇచ్చారు. జలయజ్ఞం పేరిట పెద్ద ప్రాజెక్టులు నిర్మాణమే కాదు క్షేత్ర స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ పనులను పూర్తిచేస్తే రైతులు నష్టపోరని, ప్రతీ ఏటా ముంపు సమస్యలు తలెత్తబోదని నేరుగానే ఆయన ఒప్పుకున్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని డెల్టా ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు.

ఈ పర్యటన సందర్బంగా ముంపునకు గురైన పంట పొలాలను చూసి దీనికి కారణమైన ఇరిగేషన్ నిర్లక్ష్యం చూసి ఆయన ఒకింత ఆశ్చర్యపోయారు. క్షేత్ర స్థాయిలో ఇలా జరుగుతుందా అంటూ నివ్వెరపోయారు. జలయజ్ఞం పేరిట పెద్ద ప్రాజెక్టుల మీదే దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో కొన్ని పనులను నిర్లక్ష్యం చేశామని, ఫలితంగానే ఈ నష్టం వాటిల్లినట్టు నిజాయితీగా ఒప్పుకున్నారు. వాస్తవానికి మేజర్ ఇరిగేషన్ శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆదివారం పర్యటించిన ప్రాంతాలన్నింటిలోనూ దాదాపు 20 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.

రైతులు భారీగా నష్టపోయారు. ఈ నష్టానికి గల కారణాలను ఆయన స్వయంగా తెలుసుకుని నోరెళ్ళబెట్టారు. జిల్లాల్లో ఈ విధంగా నష్టం జరుగుతుందా అంటూ ఆశ్చర్యార్ధకంతో ముఖం పెట్టారు. ఇకముందు అలా జరగదంటూ పదేపదే చెప్పుకుంటూ పర్యటన పూర్తి చేసుకున్నారు. యలమంచిలి మండలంలో నక్కల స్లూయిజ్‌ను పరిశీలించిన ఈ క్రమంలో ఇక్కడ గేట్ల నిర్మాణంలో జరిగిన జాప్యం ఫలితంగానే 17 వేల ఎకరాల్లో పంట నీట మునిగిన వాస్తవానికి మంత్రికి దగ్గరుండి స్థానిక నేతలు చూపించారు. ఈ గేట్లను నిర్మించాల్సిందిగా చాలా కాలం నుంచి తామూ, రైతులు కోరుతున్నామని, అయినా ప్రతిస్పందన లేని కారణంగానే ఈసారి కూడా వేలాది ఎకరాల్లో పంట నీటిపాలైందని, రైతులు భారీగా నష్టపోయారంటూ ఏకరువు పెట్టారు.

దీంతో మంత్రి పొన్నాల కూడా చలించిపోయారు. తప్పిదాన్ని ఒప్పుకున్నారు. రాబోయే మూడు నెలల వ్యవధిలోనే ఈ తరహా పనులపై ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా క్షేత్ర స్థాయిలో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని కూడా చెప్పుకొచ్చారు. చిన్నాచితక పనులను చూసీచూడనట్టుగా వదిలేసిన ఫలితంగానే ఇలాంటి అవాంతరం, నష్టం తలెత్తిందని, ఈ ఫలితాలు ఇక ఉండబోవంటూ స్పష్టం చేశారు. సాధ్యమైనంత మేర స్వల్పకాలిక వ్యవధిలోనే ఈ తరహా ముంపునకు గురైన ప్రాంతాల్లో నివారణ మార్గాలను అన్వేషించి ఆ మేరకు నిధులు కూడా కేటాయిస్తామని పొన్నాల లక్ష్మయ్య నేరుగానే భరోసా ఇచ్చారు.

యలమంచిలి నుంచి భీమవరం వరకు ఆయన ఆదివారం పర్యటించారు. చాలా ప్రాంతాల్లో ఆయన ముంపునకు గురైన ప్రాంతాలను చూసి నివ్వెరపోయారు. ముంపుకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను స్థానిక అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఇకముందు ఇలాంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామంటూ పదేపదే చెప్పుకుంటూ వచ్చారు. ఇదే క్రమంలో ఇప్పటిదాకా జలయజ్ఞం పేరిట భారీ ప్రాజెక్టు నిర్మాణానికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చామే తప్ప పంట నష్టాన్ని నివారించే క్రమంలో చిన్నాచితక పనులపై దృష్టి పెట్టలేకపోయామంటూ ఆవేదన కూడా వ్యక్తం చేయడం ఈసారి మేజర్ ఇరిగేషన్‌శాఖామంత్రి పర్యటనలో ఓ పెద్ద హైలెట్. అయినప్పటికి ఇంతకుముందు మూడు నెలల క్రితం డెల్టా ప్రాంతంలోనే పర్యటించారు.

ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందిగా పదేపదే అభ్యర్ధించారు. వీటికి నిధులు కేటాయించాలని కూడా డిమాండ్ చేశారు. అప్పట్లో అన్నీచేసేస్తామన్న మంత్రి ఇప్పటిదాకా ఆ మాట నిలుపుకోలేకపోయారు. తాజాగా వచ్చిన వరదలు, భారీ వర్షాల దెబ్బతో జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్న పరిణామాల నేపథ్యంలో మంత్రి తమ శాఖాపరమైన తప్పిదాలను ఒప్పుకుంటూనే తక్షణ చర్యలకు ఉపక్రమించడం విశేషం.

Friday, September 10, 2010
ముక్కలు చెక్కలు విభజిస్తే రెండుతో ఆగదు.. ఐదు రాష్ట్రాలు ఇవ్వాల్సి ఉంటుంది
స్వపరిపాలన అంటే జిల్లాకో రాష్ట్రమే..
విడిపోయాకే పంజాబ్‌లో ఖలిస్థాన్ ఉద్యమం
నాగాలండ్లోనూ ప్రత్యేక దేశం డిమాండ్...
ప్రత్యేక ఉద్యమాలన్నీ రాజకీయ ప్రేరేపితమే
ముందు వెనుకబాటు అన్నారు..
ఇప్పుడు సెంటిమెంట్ అంటున్నారు
ఫ్యూడల్ అధికారుల కోసమే అగ్రవర్ణాల 'తెలంగానం'..
విభజస్తే రాజకయ అస్థిరత తథ్యం
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల నివేదిక

"రాష్ట్రాన్ని విభజిస్తే... రెండుతో ఆగిపోదు. ఐదు రాష్ట్రాలుగా విభజించాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రతి జిల్లా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుం ది. ఆపై... ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్లు కూడా తలెత్తే ప్రమాదముంది''... అని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనవ్యక్తం చేశారు.
ఆత్మ గౌరవం, స్వపరిపాలన పేరి ట రాష్ట్రాలు ఇచ్చుకుంటూ పోతే... జిల్లాకో రాష్ట్రం ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ రాజకీయ నిరుద్యోగుల ప్రేరేపితమని తెలిపారు. గురువారం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ నివేదిక సమర్పించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని ఇందు లో నొక్కి చెప్పారు. విభజిస్తే తలెత్తే దుష్పరిణామాలను వివరించారు.
"మొదటి ఎస్సార్సీ తర్వాత పంజాబ్‌ను ఏర్పాటు చేయలేకపోయారు. ఒక విద్వేషోద్యమం తర్వాతే పంజాబ్‌ను వేరు చేశారు. ఆ తర్వాత... తమకు ప్రత్యేక దేశం కావాలంటూ 'ఖలిస్థాన్' ఉద్యమం మొదలైంది. అలాగే... గేటర్ అస్సాం నుంచి విడిపోయిన నాగాలాండ్‌లోనూ ప్రత్యేక దేశం డిమాండ్ వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా 22 ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి 'సెంటిమెంట్' డిమాండ్లు మరిన్ని వచ్చే అవకాశముంది'' అని హెచ్చరించారు.
కావూరి సాంబశివరావు నేతృత్వంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు జూబ్లీహాల్లో శ్రీకృష్ణ కమిటీకి తమ నివేదిక సమర్పించారు. ఇందులోని అంశాలను 'పవర్ పాయింట్ ప్రజంటేషన్' ద్వారా వివరించారు. ప్రత్యేకవాదులు చేస్తున్న వెనుకబాటు, సెంటిమెంట్, స్వపరిపాలన తదితర వాదనలన్నింటినీ తోసిపుచ్చారు. స్వార్థపూరిత, హ్రస్వదృష్టి కలిగిన కొందరు నేతలే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఎగదోస్తున్నారని తెలిపారు.
సమైక్య రాష్ట్రంలో తమ భూస్వామ్య అధికారాలను అనుభవించలేక పోతున్నామనే దుగ్ధతో, ఆధిపత్య వర్గాలు, కులాలు తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తుతున్నాయని ఆరోపించారు. రాజకీయ నిరుద్యోగుల చేతిలో ఇదో వజ్రాయుధంగా మారిందని అన్నారు. మతతత్వం, కులతత్వంలాగే ప్రాంతీయ తత్వం కూడా రాజకీయంగా త్వరగా ఎదిగే సాధనంగా మారిందన్నారు. వాస్తవాల వక్రీకరణ, ఊహాజనిత గణాంకాలే ప్రత్యేకవాదానికి ప్రధాన ఆధారాలని తెలిపారు. 1998, 2006, 2008 గ్రూప్-1 నియామకాల్లో తెలంగాణకు 45.03 శాతం పోస్టులు దక్కాయన్నారు. ఇటీవల ప్రత్యేక వాదుల హుకుంను ఉల్లంఘించి జరిగిన ప్రిలిమ్స్ పరీక్ష రాసిన యువతకు 'హ్యాట్సాఫ్' చెప్పారు.
ఏది వెనుకబాటు? ఎక్కడ సెంటిమెంటు?
"బాగా అభివృద్ధి చెందిన జిల్లాల్లోనూ వెనుకబడిన ప్రాంతాలున్నాయి. అలాగే... వెనుకబడిన జిల్లాల్లోనూ అభివృద్ధి చెందిన ప్రాంతాలున్నాయి. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇప్పటికే ఒక చట్టం ఉంది. మీరూ ఈ చట్టాన్ని పరిశీలించండి. ప్రస్తుత అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా ఆ కమిషన్‌ను బలోపేతం చేయవచ్చు. మూడు ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలను గుర్తించేందుకు మండలం, పంచాయతీ స్థాయిలో సమాచారాన్ని అధ్యయనం చేయాలి'' అని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు శ్రీకృష్ణ కమిటీని కోరారు.
తొలుత వెనుకబాటు, ఉద్యోగ నియామకాల్లో అన్యాయం అనే వాదనతో మొదలైన ఉద్యమం... ఇప్పుడు 'సెంటిమెంట్' వద్దకు చేరిందన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిలో తెలంగాణదే సింహభాగమని తేటతెల్లం కావడంతో సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చారన్నారు. ఇలాంటి భావోద్వేగాలతో రాష్ట్రం ఇవ్వలేమన్నారు.
భావోద్వేగాలు శాశ్వతం కావని స్పష్టం చేశారు. "డిసెంబర్ 9 ప్రకటన తర్వాతే ఉద్యమానికి ఊపు వచ్చింది. భావోద్వేగాలు తాత్కాలికం. అవి త్వరగా చల్లారతాయి. అంతేకాదు... ఈ సెంటిమెంట్ తెలంగాణ అంతటా ప్రబలంగా లేదు. ఉత్తర తెలంగాణకు, దక్షిణ తెలంగాణకు... జిల్లా నుంచి జిల్లాకు తేడా ఉంది. ఎప్పటికప్పుడు ఇది మారుతూ ఉంది'' అని నివేదికలో పేర్కొన్నారు.
ఇప్పుడున్నది విదేశీ పాలనా?
'స్వపరిపాలన పేరిట ప్రత్యేక రాష్ట్రం కావాలని అంటున్నవారు... ఇప్పుడు విదేశీ పాలనలో లేమని గ్రహించాలి' అని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు హితవు పలికారు. ఆత్మగౌరవం, స్వపరిపాలన పేరిట రాష్ట్రాలు ఇవ్వాల్సి వస్తే... జిల్లాకో రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆత్మగౌరవం అనేది ఒక భావన మాత్రమేనని.. దానికి శాస్త్రీయ కారణం లేదని తమ నివేదికలో తెలిపారు.
"సంస్కృతి, ఆత్మ గౌరవం కోల్పోతున్నామంటూ పిలుపునివ్వడం వెనుక ప్యూడల్ హక్కులను పునరుద్ధరించుకోవాలనే ఆలోచన తప్ప, మరొకటి లేదు. తెలంగాణలో వెట్టి చాకిరీతో ప్రజలను బానిసలుగా చూసేవారు. తెలంగాణ ప్రాంత పేదలు స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని అనుభవించలేక పోయారు. సమైక్య రాష్ట్రంలోనే వెట్టి విధానం రద్దయింది'' అని తెలిపారు.
విలీనం స్వచ్ఛందం: ఆంధ్రలో తెలంగాణ విలీనం స్వచ్ఛందంగా జరిగిందని... ఇది బలవంతంగా జరగలేదని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. విశాలాంధ్ర కోరుతూ తెలంగాణ నేతలే తీవ్రమైన ప్రయత్నాలు చేశారన్నారు. "విశాలాంధ్ర కోరుతూ హైదరాబాద్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఇదే తీర్మానం చేసింది.
విశాలాంధ్ర కోరుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు హైదరాబాద్ రాష్ట్ర పరిధిలోని పది జిల్లాల్లో 7 జిల్లాల్లోని కాంగ్రెస్ కమిటీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయని వివరించారు. 1953లో పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్క ఎంపీ కూడా దానిని వ్యతిరేకించలేదు.
ఎస్సార్సీ సైతం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనం అయ్యేందుకు సూత్రప్రాయంగా సమ్మతించింది. అయితే, దీనిని పరిపాలనాపరమైన కారణాలతో ఐదేళ్లు వాయిదా వేసింది'' అని తెలిపారు. ఎస్సార్సీ ఇలాంటి నిబంధన ఏ రాష్ట్రంలోనూ విధించలేదని గుర్తు చేశారు. 1969లో జైతెలంగాణ, 1972లో జై ఆంధ్ర ఉద్యమాలు తలెత్తినప్పుడు అప్పటి ప్రధాని ఇందిర దృఢచిత్తంతో వ్యహరించారని తెలిపారు. రాష్ట్ర విభజనతో సమస్య పరిష్కారం కాకపోగా, మరిన్ని కొత్త సమస్యలు వస్తాయని ఆమె గుర్తించారన్నారు.
విభజనతో అస్థిరత: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, మిజోరాం వంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. పైగా అస్థిరతకు, రాజకీయ బేరసారాలకు నిలయాలుగా మారాయని... కొన్ని రాష్ట్రాలు దివాలా అంచుల్లో నిలిచాయని వివరించారు.
"రాష్ట్రాన్ని విభజిస్తే మరిన్ని ఉప ప్రాంతీయ పార్టీలతోపాటు కులాలు, ఉప కులాల పేరిట కూడా పార్టీలు పుట్టుకొస్తాయి. అప్పుడు ఎన్నికల్లో అస్పష్ట తీర్పు మాత్రమే వెలువడుతుంది. రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. అంతిమంగా అభివృద్ధి, భద్రతకు భంగం వాటిల్లుతుంది'' అని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే సంకుచిత భావాలు, ఉప ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరుగుతుందని... రాష్ట్ర రాజకీయాల్లో వాటి అవసరమూ పెరుగుతుందని అన్నారు. ఇలాంటి పార్టీలే భవిష్యత్తును నిర్దేశిస్త్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ రాజధాని...
గత ఐదేళ్లలో హైదరాబాద్ జనాభా 34 నుంచి 41 శాతానికి పెరిగిందని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు శ్రీకృష్ణ కమిటీకి తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వలసలు రావడం వల్లే జరిగిందన్నారు. వీరంతా రాజధాని అభివృద్ధిలో భాగస్వాములయ్యారని తెలిపారు. భారీ పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించకుంటే హైదరాబాద్ కూడా ఒకప్పటి రాజధాని నగరం కర్నూలులాగే ఎలాంటి అభివృద్ధి జరగకుండా ఉండేదని అన్నారు.
హైదరాబాద్‌లోని పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల జాబితాను తమ నివేదికలో పొందుపరిచారు. డిగ్రీ కాలేజీల నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాల దాకా... రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, వాటిలో తెలంగాణ వాటా ఎంత అనే గణాంకాలు సమర్పించారు.
కావూరి ఇంట్లో కసరత్తు: శ్రీకృష్ణ కమిటీ వద్దకు వెళ్లే ముందు కావూరి సాంబశివరావు నివాసంలో ఎంపీలు మేకపాటి రాజమోహన రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట రామిరెడ్డి, కిల్లి కృపారాణి, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కనుమూరి బాపిరాజు, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, నేదురుమల్లి జనార్దన రెడ్డి సమావేశమయ్యారు. కమిటీ ముందు వినిపించాల్సిన వాదన్రలపై సమీక్షించారు.
సమైక్యాంధ్ర వాదనలు పూర్తిగా కావూరి విన్పించాలని.. మిగిలిన ఎంపీలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాలని తీర్మానించారు. అనంతరం కేవీపీ, నేదురుమల్లి మినహా మిగిలిన ఎంపీలందరూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు హాజరయ్యారు. కావూరి నివాసంలో జరిగిన భేటీకి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి రాలేదు. ఆయన నేరుగా కమిటీతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
చిత్తగించండి...
* ప్రత్యేక వాదాలన్నీ రాజకీయ ప్రేరేపితమే. 1969లో కాసు బ్రహ్మానంద రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించగానే... తెలంగాణ ఉద్యమం గాలి తీసిన బుడగలా మారింది. అలాగే.. 1972లో పీవీ నరసింహరావును తప్పించగానే జై ఆంధ్ర ఉద్యమమూ మాయమైపోయింది.
* ఒకప్పుడు తెలంగాణలో ఉన్న వెట్టి వ్యవస్థ సమైక్య రాష్ట్రంలోనే అంతమైంది. తమకు కావాల్సింది దొరల తెలంగాణ కాదని, సామాజిక తెలంగాణ అని వెనుకబడిన వర్గాలు డిమాండ్ చేశాయి. దొరల తెలంగాణకంటే సమైక్య రాష్ట్రంలోనే ఉంటామని ప్రకటించాయి కూడా.
* తెలంగాణ రాష్ట్రం ఇద్దరు ప్రధాన మంత్రులను, నలుగురు ముఖ్యమంత్రులను అందించింది. పీవీ నరసింహారావుది తెలంగాణా? సీమాంధ్రా? అని ఎవరూ చూడలేదు. ప్రతి తెలుగు వాడూ ఆయనను తమ వాడుగానే భావించారు. ప్రధానిగా ఉన్న ఆయన రాయలసీమలోని నంద్యాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
* 2004లో ఎన్నికల పొత్తులో సీపీఐ, సీపీఎంకు కేటాయించిన స్థానాల్లో పది చోట్ల టీఆర్ఎస్ పోటీ చేసింది. ఈ పదిచోట్లా టీఆర్ఎస్ ఓడిపోగా... సమైక్య నినాదం వినిపించిన కమ్యూనిస్టులు అధికచోట్ల నెగ్గారు. 2008లో టీఆర్ఎస్ తనంత తాను తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో 2 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాల్లో ఓటమిపాలైంది.
* విభజన రెండు రాష్ట్రాలతో ఆగిపోదు. 5 రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. గిరిజనులు మన్యసీమ కావాలంటున్నారు. తమకూ రాష్ట్రాలు కావాలని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Tuesday, July 27, 2010
Subscribe to:
Posts (Atom)